Header Banner

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

  Sat May 10, 2025 21:10        India

హైదరాబాద్ నగరంలో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగాన్ని నిషేధించగా, జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

శంషాబాద్ పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, గాలిలో ఎగిరే ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని, జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జంట నగరాల్లో బాణసంచాపై ఆంక్షలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణసంచా కాల్చరాదని ఆయన ఆదేశించారు. బాణసంచా పేలుళ్ల వల్ల వచ్చే ఆకస్మిక పెద్ద శబ్దాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఇలాంటి శబ్దాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌరులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి బాణసంచా కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #HyderabadAirport #HighAlert #DroneBan #AviationSecurity #CyberabadPolice #NoFlyZone